శ్యామ్‌ సింగరాయ్‌.. ఓటీటీలో రికార్డులు తిరగరాస్తోన్న చిత్రం. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి దేవదాసిగా కనిపించి మెప్పించింది

కెరీర్‌లో తొలిసారి సున్నితమైన పాత్రను పోషించిన ఈ హీరోయిన్‌ నటనకు అందరూ కూడా ఫిదా అవుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమాలో ఆమె చేసిన డ్యాన్స్‌కు జనాలు బాగా మంత్రముగ్ధులవుతున్నారు. ఓ పక్క ఆమె మీద ప్రశంసల జల్లు కురుస్తుంటే  దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి అందంగా లేదు అంటూ తమిళనాట ఓ వార్త ప్రచురితమైందట.. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సాయిపల్లవిపై వచ్చిన వార్తలు బాధించాయంటూ పోస్ట్ కూడా చేశారు.

అంతేకాకుండా తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సాయిపల్లవి గురించి బాడీ షేమింగ్‌ చేయడం నన్ను ఎంతగానో బాధ పెట్టింది.గతంలో నా రూపాన్ని గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఎప్పుడూ ట్రోల్‌ చేసేవారు అలాంటి మాటలు పడ్డవారికే ఆ బాధంటే ఏమిటో తెలుస్తుంది. బాడీ షేమింగ్‌ చేస్తున్నారని తీవ్రంగా బాధపడ్డాను. కానీ నా ప్రతిభతో, శ్రమతో ఆ మాటలను బాగా ఎదుర్కొన్నాను. అలాంటి కామెంట్స్‌ బారిన పడకుండా ఉండటానికి మనమేమీ మహాత్ములం కాదు కదా నాపై చేసిన కామెంట్స్‌ను నేను అస్సలు పట్టించుకోలేదు. కానీ ఆ ట్రోలింగ్‌ వల్ల బాధపడతారా? అంటే కచ్చితంగా అవుననే బదులిస్తానని చెప్పిందట .

'పొట్టిగా, నల్లగా  నాలాంటి(రింగుల) జుట్టుతో పుట్టడం మన చేసిన తప్పేమీ కాదు. వీటన్నింటిలో కూడా అందం ఉంది. కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఊరికే రాలేదు కదా.కాకి తన పిల్లను బంగారు పిల్లగానే భావిస్తుందే తప్ప నల్లగా ఉందని వదిలిపెట్టదు కదా! మహిళలు బాడీ షేమింగ్‌కు గురవుతారు కానీ పురుషులకు అలాంటి మాటలు అస్సలు ఎదురవవు. 50 ఏళ్ల వయసులో ఉన్న పురుషులను కూడా యువకులుగా చూస్తారు కానీ స్త్రీలను మాత్రం అలా అస్సలు ఎందుకు చూడలేరు. స్త్రీల ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఈ సమాజం.. మహిళలను బాధపెడుతూ వారి ఎదుగుదలను తగ్గించడానికి యత్నిస్తోంది' అని తమిళిసై చెప్పుకొచ్చారట..

మరింత సమాచారం తెలుసుకోండి: