ఇక ఈ రెండు సినిమాల తరువాత ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గీత గోవిందం లాంటి మంచి కథ కావడం ఈ చిన్న సినిమా ఒప్పుకోవడానికి కారణం అని తెలుస్తుంది. టక్ జగదీష్ సినిమా తర్వాత శివ నిర్వాణ సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట ప్రకారం ఈ సినిమా చేస్తున్నాడు. తొందర లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది.
ఇక సుకుమార్ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప రెండో భాగం సినిమా విడుదల తరువాత ఆయన ఈ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు భారీ స్థాయిలో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈ నాలుగు సినిమాల తర్వాత కూడా విజయ్ దేవరకొండ పెద్ద దర్శకులను లైన్ లో పెడుతున్నాడట. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన చేయబోయే సినిమా దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మహేష్ తో చేస్తున్న సినిమా తర్వాత త్రివిక్రమ్ విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయనున్నాడు. కొరటాల శివ కూడా విజయ్ దేవరకొండ తో టచ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయబోతున్న కొరటాల శివ ఆ తర్వాత విజయ్ దేవరకొండ సినిమా చేస్తాడట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి