తెలుగులో చివరిగా పెద్దన్న సినిమాలో నటించాడు రజనీకాంత్.. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. ఇక ఈ సినిమా మాస్ కంటెంట్ అనే విమర్శలను మూటగట్టుకుంది..ఇక ఈ సినిమా తర్వాత మరే సినిమాను ప్రారంభించలేదు రజనీకాంత్. ప్రస్తుతం విశ్రాంతిలోనే ఉన్నాడు రజనీకాంత్. ఇక రాజకీయాలలో ఎలాంటి ఎంట్రీ లేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది.. ఇక తన జీవితాన్ని ఎక్కువగా సినిమాకే అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు రజినీకాంత్.

దీంతో ఆయన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు.. మరికొద్ది రోజులు సూపర్ స్టార్ రజినీకాంత్ ని తెరపైన చూసే అవకాశం అభిమానులకు దక్కింది.. ఇక రజనీకాంత్ తన తదుపరి సినిమాలో ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఒక మూవీ ని చేయడానికి సిద్ధమయ్యాడు అన్నట్లుగా తెలుస్తోంది. అది కూడా 168 వ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తన 169 వ మూవీ చేయబోతున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ.. డిసెంబర్ నెలలో కాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందట.

ఇక రజనీకాంత్ 170వ సినిమాను తెరకెక్కించడానికి ఏకంగా ఇద్దరు స్టార్ డైరెక్టర్లు పోటీ పడుతున్నట్లుగా సమాచారం.. అయితే ఆ డైరెక్టర్లు ఇద్దరు ఎవరు అనే విషయం తెలియలేదు కానీ.. ఇప్పటికే ఆ ఇద్దరు డైరెక్టర్లు రజనీకాంత్ కు కథ వినిపించినట్లుగా తెలుస్తోంది.. కానీ కథ పరంగా ఏ సినిమా తక్కువ కాదని రజినీకాంత్సినిమా లాక్ చేయాలో తెలియక సతమతమవుతున్నట్లుగా కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. అయితే గతంలో కూడా లోకేష్ ఘన రాజు తో ఒక సినిమా చేయాలని రజనీకాంత్ అప్పట్లో తెలియజేయడం జరిగింది. ఇక మరొక డైరెక్టర్ రంజిత్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: