అక్కినేని హీరో అఖిల్ ఇప్పటివరకు కెరీర్లో నాలుగు సినిమాల్లో నటించాడు ఈనాడు సినిమాల్లో ఏ సినిమా కూడా 50 కోట్ల షేర్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోలేదు. ఇటీవల ఈ హీరో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా అఖిల్ ఖాతాలో మరో మంచి సక్సెస్ లేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతం అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమా కోసం 50 కోట్ల భారీ బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం హీరో డైరెక్టర్ తన రెమ్యునరేషన్ను తగ్గించుకొని మరి పని చేస్తున్నారట. 

అంతేకాదు హీరో అఖిల్ అయితే ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక సమాచారం వినిపిస్తోంది. అయితే ఏజెంట్ సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధిస్తే అప్పుడు ఆ సినిమా లాభాల్లో వాటా తీసుకున్నారట. మరో వైపు దర్శకుడు సురేందర్రెడ్డి ముందు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం తక్కువ రెమ్యునరేషన్ని నిర్మాతకు చెప్పినట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం అఖిల్ తన మెకోవర్ వారి మొత్తాన్ని మార్చేశాడు.స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న లెజెండ్ సినిమాలో అఖిల్ ఒకసారి కొత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు.

ప్రస్తుతం అఖిల్ కెరీర్ ఈ సినిమా పైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అఖిల్ గత సినిమాలేవీ ఇప్పటివరకు 55 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి లేదు. అయితే ఏజెంట్ సినిమాతో అఖిల్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు ఎందుకు ఉంటాడని అభిమానులు ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా కోసం ముందు ఎంచుకున్న విలన్ ని తీసేసి మరో కొత్త విలన్ కోసం చిత్రబృందం వెతుకుతున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: