సాధారణంగా ఇండస్ట్రీలో నటించే ఏ హీరో అయినా సరే మొదటి స్థానం సంపాదించుకోవడం కోసం ఇతర హీరోలతో పోటీకి దిగుతూ ఉంటారు. ఇక వారు నటన పరంగా తమలో ఉన్న ప్రతిభను సినీ ప్రేక్షకులకు కనబరుస్తూ నెంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడానికి పోటీ పడుతూ సినీ ప్రపంచంలో స్టార్ హీరోలుగా దూసుకెళ్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలా ఇండస్ట్రీలో చాలా మంది మల్టీ స్టార్ సినిమాలు చేస్తూనే ఉన్నారు.

అప్పట్లో స్టార్ హీరోలు అక్కినేని నాగేశ్వరరావు - నందమూరి తారక రామారావు వంటి అగ్ర హీరోలు కూడా ఒకే స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక నాలుగు దశాబ్దాల కిందట ఎన్టీఆర్ - ఏఎన్నార్, కృష్ణ - శోభన్ బాబు, కృష్ణంరాజు - చిరంజీవి లాంటి అగ్ర నటులు కలిసి నటించిన సినిమాలను చాలానే చూశాం. కాగా.. అప్పట్లో ఆ హీరోల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. కథ డిమాండ్ చేయడంతో ఏమాత్రం వెనుకడుగు వేయలేదనే చెప్పాలి మరి. కానీ 1990 తర్వాత హీరోల మధ్య ఇమేజ్ సమస్య మొదలైయ్యాయి. దాంతో మల్టీ స్టార్ సినిమాలు చేయడం పూర్తిగా తగ్గిపోయాయి.

ఇక మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ స్టార్ సినిమాలను చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో వెంకటేష్ - పవన్ కళ్యాణ్, తాజాగా రామ్ చరణ్ - ఎన్టీఆర్, వెంకటేష్- వరుణ్ తేజ్, చిరంజీవి-రామ్ చరణ్, వెంకటేష్- మహేష్ బాబు ఇలా వీరి కాంబినేషన్లో సినిమాలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇక చిరంజీవి- బాలయ్య కలిసి నటించిన సినిమా ఏంటో ఒక్కసారి చూద్దమా. అయితే వెంకటేష్ హీరోగా చేసిన త్రిమూర్తులు సినిమాలోని ఓ పాటలో చిరంజీవి, బాలయ్య కనిపిస్తుంటారు. అంతేకాదు ఈ సినిమాలో నాగార్జున, శోభన్ బాబు, కృష్ణ కూడా ఈ పాటలో డ్యాన్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: