తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ , తమ కుమారుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే విషయంపై అభిమానులు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. కానీ ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ గురించి ఒక వార్త వినిపిస్తోంది. అదేమిటంటే బాలకృష్ణ కుమారుడికి త్వరలోనే వివాహం చేయబోతున్నారనే వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. ఇక ఈ విషయం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఒకానొక సమయంలో మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టం లేదని వార్త బాగా వినిపించింది.. తనకు ఎక్కువగా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదని వార్త గతంలో కూడా బాగా వినిపించింది. తాజాగా దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో సందడి చేసినటువంటి కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.. ఇక ఈ ఫోటోలను బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి సోదరి పురందేశ్వరి ఇంటికి వెళ్లినట్టు సమాచారం.. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇదిలా ఉండగా బాలయ్యబాబు ఉన్నట్టుండి తన సోదరి పురందేశ్వరి ఇంటికి ఎందుకు వెళ్ళాడు.. ఏ విషయంపై అక్కడ చర్చలు జరిపారు అనే విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆరా తీయగా అది మోక్షజ్ఞ వివాహం గురించి చర్చలు జరిపారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ దగ్గరి బంధువులలో మోక్షజ్ఞ కు ఒక సంబంధం వచ్చింది అని.. వారు కూడా పురంధేశ్వరి కుటుంబానికి చాలా దగ్గరి బంధువులు అట.. అందుకే బాలకృష్ణ స్వయంగా తన సోదరి పురందేశ్వరి ఇంటికి వెళ్లి మోక్షజ్ఞ వివాహానికి సంబంధించిన మాటామంతి నిర్వహించారని.. తాజాగా  నందమూరి సన్నిహిత వర్గాల నుంచి ఈ వార్త వినిపిస్తోంది..

అందుకే ఇలా ఉన్నట్టుండి బాలయ్య బాబు కుటుంబంతో కలిసి తన సోదరి ఇంటికి వెళ్ళాడు అని సమాచారం.. ఇప్పటివరకు ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.... కానీ బాలయ్య బాబు పురందేశ్వరి ఇంట్లో కనిపించడంతో మోక్షజ్ఞ పెళ్లి విషయమై చర్చలు జరిపినట్లు గా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: