ఇతను చేసే సహాయాలు ముందు భారత ప్రభుత్వం ఏ పాటిది అని సామాన్యుడు ఆలోచించేలా చేశాడు. అయితే అలాంటి సోనూ సూద్ గత మూడు రోజుల నుండి ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా పంజాబ్ లో సోనూ పై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అయితే ఏమి జరిగింది అంటే సోనూ సూద్ చెల్లెలు మాళవికా సూద్ పంజాబ్ లో జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున మోగా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే గా పోటీ చేస్తోంది. ఇందు కోసం సోనూసూద్ ప్రచార బాధ్యతలను ఎత్తుకున్నాడు. అయితే ప్రచారం అంటే పోలింగ్ రోజు ముందు వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.
కానీ సోనూ సూద్ ఎలక్షన్స్ రోజు అంటే ఆదివారం కూడా ప్రచారం చేయడంతో ఎన్నికల ఉల్లంఘన కింద ఇతనిపై మోగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 199 కింద కేసు నమోదు చేశారు. దీనితో దేశ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవును ఎన్నికల ఉల్లంఘనే అయినా ఒక వార్నింగ్ ఇస్తే సరిపోతుంది కదా? కేసు నమోదు చేయడం ఎందుకు అంటూ వాపోతున్నారు. మరి ఈ విషయం ఎక్కడికి దారి తీస్తుందో అని అంతా బాధపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి