టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ తాజాగా నటించిన 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించిన ఈ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా..ఈ సినిమాల్ ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 11 ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం  "సలార్", "ఆదిపురుష్" వంటి సినిమాలు చేస్తున్న ప్రభాస్ నాగ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే" సినిమాతో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ముందుగా ఈ సినిమాని తక్కువ రోజుల్లోనే పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ తాజాగా షూటింగ్ డేట్లను 260 రోజులకి ఎక్స్టెండ్ చేసినట్లు తెలుస్తోంది.అంతేకాదు   ఏప్రిల్ మరియు మే లో సినిమాలో నటించబోతున్న స్టార్ కాస్ట్ మొత్తం షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఇప్పటికే ఎన్జీకే వంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించిన సూర్య ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా కథ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని ఫ్యూచర్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ అన్ని శక్తులు ఉన్న సూపర్ హీరో గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఇక 2023 లో ఈ సినిమా అన్ని ఇంటర్నేషనల్ భాష లలో విడుదల కాబోతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: