ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్ మొదటిసారిగా కలిసి నటించబోతున్నారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కొన్ని రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇక ట్రైలర్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం ఒక మాస్ ఎలిమెంట్స్తో ఉండే విధంగా కనిపిస్తోంది. మహేష్ బాబు ఈ చిత్రంలో సరికొత్తగా చూడవచ్చు అని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు మహాశివరాత్రి కావున చిత్రబృందం ఈ రోజు ఒక అప్ డేట్ ఇవ్వనుంది. శివరాత్రి స్పెషల్ పోస్ట్ ని ఈరోజు 11 గంటల 7 నిమిషాలకు ఒక అప్డేట్ను ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఇక సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి సాంగ్ తెగ వైరల్ గా మారుతోంది. ఇక ఈ సినిమా మే 12వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్లోనే జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా మహేష్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి