60 సంవత్సరాల వయసులో అరబ్ షేకులు.. 12 ఏళ్ల బాలికను ఎలా వివాహమాడు తారేనే కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆ నాగరికత గురించి ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలనే కథాంశంతో హైదరాబాదులో ఒక పాతబస్తీలో ఇలాంటి ఘటనలు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.. ఆ సినిమా పేరే "కుబూల్ హై". ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల అవ్వడం జరిగింది అందుకు సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.

"కుబూల్ హై"ఈ సినిమా హైదరాబాద్లో పాత బస్తీ లో జరిగిన బాల్య వివాహాలు అక్రమ రవాణా సంబంధం గురించి ఈ టీజర్లో క్లియర్ గా చూపించడం జరుగుతుంది. అయితే ఇలాంటి సినిమాలు విడుదల చేయడానికి ఆహా బృందం పెద్ద సాహసమే చేస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కేవలం విజువల్స్ పరంగానే కాకుండా ఎన్నో జీర్ణించుకోలేని కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాట్లు గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా టీజర్ ను చూస్తే ప్రతి ఒక్కరికి ఎంతో ఎక్సైటింగ్ గా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఆహా లో ఈ సినిమా పింగిల్ ప్రణవ్ రెడ్డి నిర్మిస్తున్నారు.


ఇక ఒక చిన్నారి అతి చిన్న వయసులోనే వివాహం చేసుకొని పడుతున్న బాధలను కూడా ఈ టీజర్ లో ఎంత అద్భుతంగా చూపించారు. ఇక ఈ టీజర్లో కొన్ని ప్రదేశాలను ఎంతో అద్భుతంగా, నిజ జీవిత కథ ఆధారంగా చూపించడం జరుగుతోంది. ఇక ఇలాంటి చిన్న పిల్లలకు సంబంధించి త్రిల్లింగ్ యాంగిల్ చిత్రం ఎంత మటుకు ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ సస్పెన్స్ కర థ్రిల్లర్ సినిమా మార్చి 11వ తేదీన ఆహా లో విడుదల కానుంది. ఇలాంటి సినిమాలు చేయాలంటే ఇది ఒక సాహసం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: