అయితే ఇప్పుడు తాజాగా రాధే శ్యామ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఇందులో ప్రభాస్ కి తల్లిగా నటిస్తోంది. ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఈమెను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక అందుకు కారణం ఏమిటంటే ఒక కొత్త సీనియర్ నటి అయితే కాస్త ఫ్రెష్ ఫీల్ ఉంటుందని ఆ డైరెక్టర్ నమ్మకంతో ఈమెను తీసుకున్నట్లు సమాచారం. ఆ పాత్రను అంగీకరించడానికి గల కారణాన్ని కూడా భాగ్యశ్రీ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. డైరెక్టర్ రాధాకృష్ణ తన పాత్రను ఇందులో చాలా చక్కగా నెరేట్ చేశారని తెలిపింది. తన పాత్రకు సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉన్నది అని తెలిపింది.
ఇక పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో పాటు తన పాత్ర కూడా ఒక చాలెంజింగ్ గా ఉంటుందని తెలుపుతూ వచ్చింది. అందుచేతనే తను ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను అని తెలిపింది. ఇక ఈ చిత్రంలో తను ఒక పెద్ద డాన్సర్ కాకపోయినప్పటికీ డాన్స్ వేయ వలసి వచ్చిందని తెలిపింది. స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి చేయక తప్పలేదని తెలిపింది. మొదటిరోజు షూటింగ్ సెట్లో ప్రభాస్ తనకి కనిపించినప్పుడు ఎలా పరిచయం చేసుకోవాలో తెలియక ఆమె అయోమయంలో ఉండేదట. కానీ ప్రభాస్ మాత్రం తన దగ్గరకు వచ్చి తానే స్వయంగా పరిచయం చేసుకున్నాడు అని తెలిపింది. ఇక అంతే కాకుండా ప్రభాస్ చిన్నప్పటి నుంచి తన ఫ్యాన్ అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయిందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి