మహేష్ బాబు అటు ఇండస్ట్రీలోనూ, ఇటు సేవాగుణం లో కూడా మంచి పేరు సంపాదించాడు. ఇక తన భార్య నమ్రతతో కలసి ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను చేయడం జరిగింది.. ఇప్పటివరకు ఎన్నో వేలాది మంది పిల్లలకు గుండె ఆపరేషన్ లకు ఆర్థిక సహాయాన్ని అందించి.. తమ అభిమానులతో, ప్రేక్షకులతో సహా శభాష్ అనిపించుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో ఒక నిర్ణయాన్ని తీసుకొని అందరినీ ఆశ్చర్య పరిచేలా చేశాడు మహేష్ బాబు. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.


పుట్టుకతోనే వచ్చే గుండె జబ్బులు ఉన్న పిల్లలకు ఉచితంగా చికిత్స అందించాలని మహేష్ బాబు అగ్రశ్రేణి ఆసుపత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా రెయిన్బో హాస్పిటల్.. ఆంధ్ర హాస్పిటల్ తో కలిసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు సైతం మహేష్ బాబు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన అత్యంత గౌరవనీయులైన నటులు మహేష్ బాబు ఒకరని చెప్పవచ్చు. మహేష్ బాబుకి పిల్లలంటే ఎంతో ఇష్టం కాబట్టి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలలో పాల్గొనడం జరుగుతుంది. ఇక మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పిల్లలకు ఎంతో చురుకుగా వైద్య సేవలు అందిస్తోంది.ఇప్పుడు తాజాగా మహేష్ బాబు ఫౌండేషన్ తో రెయిన్బో చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ తో కలిసి చిన్నపిల్లలకి వైద్యం అందించడానికి ముందుకు రావడం జరిగింది. భారత దేశంలో ప్రతి 1000 మంది జనాలు ఖచ్చితంగా 10 మంది చిన్నారులకు పుట్టుకతోనే గుండె సమస్యలు వస్తూనే ఉన్నాయి. అలాంటి వారి కోసం ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ను ప్రారంభించారు.. ఇందులో మహేష్ బాబు మాట్లాడడం జరిగింది. ఇలాంటి ఫౌండేషన్ ప్రారంభించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చిన్న పిల్లలు ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగానే ఉంటారని తెలిపాడు. ఇక ఎంతో మంది పిల్లలకు సహాయం చేయడం తనకు చాలా సంతోషమని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: