ఇక మీకు రేషన్‌కార్డు ఉంటే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే. రాష్ట్ర ప్రభుత్వం అనేది రేషన్ కార్డు జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. రేషన్ కార్డులో తేడాలుంటే వెంటనే రద్దు చేస్తారు.ఇక మీరు చాలా కాలంగా ఆహార ధాన్యాలు తీసుకోవడానికి మీ రేషన్ కార్డును ఉపయోగించకపోతే మీ కార్డును రద్దు చేసే ఛాన్స్ లు ఉంటాయి. ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా పథకం కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఆహార ధాన్యాలు అందిస్తున్న విషయం తెలిసిందే. కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా అతి తక్కువ ధరకు రేషన్ అనేది అందిస్తుంది. పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నిజానికి మీరు ఏ నెలలో రేషన్ తీసుకున్నారు.. మీ కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు వంటి మొత్తం సమాచారం కూడా ఈ రేషన్ కార్డులో ఉంటుంది. ఇక నిబంధనల ప్రకారం.. మీ పేరు మీద రేషన్ కార్డు ఉంటేనే మీకు పీడీఎస్‌లో ఆహార ధాన్యాలు అనేవి అందుతాయి. కానీ ఈమధ్య అనేక కేసులు తెరపైకి వచ్చాయి.


ఇందులో చాలా కాలంగా ఉపయోగించని రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేశారు.‘ఇక రేషన్ కార్డుదారుడు ఆరు నెలలుగా రేషన్ తీసుకోకపోతే నిబంధనల ప్రకారం అతనికి తక్కువ ధరకు లభించే ఆహార ధాన్యాలు అవసరం లేదని దాని అర్థం. లేదా అతనికి రేషన్ తీసుకునే అర్హత లేదని అర్ధం. ఈ కారణాల ఆధారంగా ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వ్యక్తికి సంబంధించిన రేషన్ కార్డు రద్దు అవుతుంది. రాజధాని ఢిల్లీ, బీహార్ ఇంకా జార్ఖండ్‌లలో రేషన్ విషయంలో ఇదే నియమం వర్తిస్తుంది. ఒకవేళ మీ రేషన్ కార్డు కనుక రద్దు చేస్తే మీరు దానిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ రాష్ట్రంలోని AePDS అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చెయ్యడం ద్వారా కొన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు మీరు భారతదేశం అంతటా కూడా AePDS రేషన్ కార్డ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా దీన్ని చాలా ఈజీగా సక్రియం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: