టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం త్రిబుల్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందించబడింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఊహించని రేంజిలో అంచనాలు పెరిగిపోయాయి అన్న విషయం తెలిసిందే. జనవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఇక ఆ తర్వాత మార్చి 25వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ సినిమా మార్చి 25 వ తేదీన విడుదల అవుతూ ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే థియేటర్ల వద్ద త్రిబుల్ ఆర్ హడావిడి మాత్రం మొదలైంది అని చెప్పాలి. మరీ ముఖ్యంగా అటు ప్రేక్షకులైతే ఊహించని రీతిలో అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే కేవలం భారత్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా భారీ స్థాయిలో త్రిబుల్ ఆర్ టికెట్స్ అమ్ముడుపోయాయి. మెగా నందమూరి అభిమానులు టికెట్స్ కొనుగోలు చేయడంలో పోటీ పడుతున్నారు అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా విషయంలో  తగ్గేదేలా అంటున్నారు అని అర్థమవుతుంది.


 ఎందుకంటే ఇటీవలే ఒక థియేటర్ లోని మొత్తం టిక్కెట్లను ఎన్టీఆర్ అభిమానులు కొనుగోలు చేయడం గమనార్హం. అయితే ఇక ఒకవైపు ఎన్టీఆర్ మరో వైపు రామ్ చరణ్ అభిమానులను కూడా ఈ సినిమా సంతృప్తి పరుస్తుందని జక్కన్న చెప్పారు.   ఎవరినీ తక్కువ చేయకుండా కథకు తగ్గట్లుగా  పాత్రలను రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కోసం యూఎస్లో ఫ్యాన్స్ ఫ్లోరిడాలోని సినిమా టీన్సెల్ టౌన్ లో 6 గంటల ప్రీమియర్ షో ప్రసారమవుతుంది. అయితే ఈ షో టికెట్స్ మొత్తం బుక్ చేసుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు. వీటిలో దాదాపు 170 టికెట్లకు పైగా ఉంటే మొత్తం కొనుగోలు చేశారట. ఇక దీన్ని బట్టి అభిమానులు త్రిబుల్  సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అని అర్థమవుతుంది. త్రిబుల్ ఆర్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టటం ఖాయమని సినీ పండితులు కూడా అంచనా వేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: