కమల్ హాసన్ నట వారసురాలిగా సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్  గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  కమల్ హాసన్ కూతురుగా  సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకు తానుగా సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఒక ప్రత్యేక గుర్తింపును  ఏర్పరచుకున్న శృతి హాసన్ ప్రస్తుతం కూడా వరుస పెట్టి సినిమాలలో నటిస్తుంది.  ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్  దగ్గర బోల్తా కొట్టాయి,  అయితే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన గబ్బర్ సింగ్ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ సినిమాలలో అవకాశాలు బాగానే దక్కాయి,  ఇది ఇలా ఉంటే గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ లను సాధించడంతో శృతి హసన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది,  కాకపోతే శృతి హాసన్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇది ఇలా ఉంటే వాఖిల్ సబ్ సినిమాతో మళ్ళీ శృతి హాసన్ మంచి విజయాన్ని అందుకుంది,  ఆ తర్వాత క్రాక్ సినిమాతో మరో విజయాన్ని శృతి హాసన్ అందుకుంది.

 ఇలా వరుస పెట్టి రెండు విజయాలను అందుకున్న శృతి హాసన్ ప్రస్తుతం కూడా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది,  శృతి హాసన్ ప్రస్తుతం 'సోలార్'  సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది,  ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా ఈ సినిమాకు ప్రశాంయ్హ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు,  ఈ సినిమాతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది,  ఈ సినిమాలో నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న  సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతుంది, ఈ విషయాన్ని తాజాగా ఈ చిత్ర బృందం కన్ఫామ్ చేసింది, ఇలా వంట తిరుమల తో శృతి హాసన్ ఫుల్ స్పీడ్ మీద ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: