యువ హీరోల జోరు ఇటీవలి కాలంలో టాలీవుడ్లో ఎక్కువైపోయింది. అదే ఈ సమయంలో కొత్త తరహా కథలను అటు ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తూ ఉండడంతో మంచి కథతో వస్తే సక్సెస్  సాధించవచ్చు అని  ప్రతి ఒక్కరిలో కూడా నమ్మకం వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతో మంది కొత్త హీరోలు విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను ఖాతాలో వేసుకుని పాపులారిటీ సంపాదిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీ హీరో గా ఎంట్రీ ఇస్తున్న వారిలో ఎక్కువగా  నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు.


 ఈ క్రమంలోనే భద్రం బీ కేర్ఫుల్ అనే సినిమాతో అందరికీ సుపరిచితుడు గా మారిపోయాడు చరణ్. కాగా చరణ్ హీరోగా కరిష్మా హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా రోరి. ఈ సినిమాకు చరణ్ స్వీయ దర్శకత్వంలో రాబోతుంది అన్నది తెలుస్తుంది. పిటిఎఫ్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లెజండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు జయప్రకాష్ దేవిశ్రీ ప్రసాద్ లాంటి నటులతో ఇక భారీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.  ఇక ఈ సినిమాకు దర్శకుడు నిర్మాత హీరో అయిన చరణ్ పుట్టినరోజు సందర్భంగా మొదటి పోస్టర్ను దర్శకుడు మారుతి చేతులమీదుగా విడుదల చేశారు.



 ఈ క్రమంలోనే ఇటీవలే ప్రెస్ మీట్ లో భాగంగా హీరో చరణ్ మాట్లాడుతూ.. కథ గురించి పలు విషయాలను చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక కుర్రాడి కథ ఇది. పాకిస్తాన్ కూ అనుకోని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కొంత మంది హిందువులను కలిసి వారి కష్టాలను తెలుసుకుంటాడు కుర్రాడు.. ఇక వారితో కలిసి ఇండియాకు క్షేమంగా వచ్చాడా లేదా అన్నదే ఈ కథ అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కథ మొత్తం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని చెప్పుకొచ్చాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి టీజర్ ని కూడా విడుదల చేస్తాం అంటూ క్లారిటీ ఇచ్చాడు చరణ్ హోలీ.

మరింత సమాచారం తెలుసుకోండి: