ఇప్పటి వరకు సినిమా చరిత్రలో ఈ రకమైన ప్రేమకథ రాలేదని... కథే మాకు ప్లస్ అవుతుంది అని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉన్నారు. అయితే ఈటీ మరియు రాధే శ్యామ్ చిత్రాలకు తమిళనాడు లో ప్రేక్షకులు షాక్ ఇచ్చారు అని చెప్పాలి. ఈ రెండు సినిమాలకు బుకింగ్స్ ఏమాత్రం బాగా లేనట్లు తెలుస్తోంది. తమిళ ప్రేక్షకులు ఎవ్వరూ ఈ రెండు సినిమాలకు టికెట్లను బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. దీనికి కారణం ఫిబ్రవరి 24 న విడుదలైన "వలిమై" సినిమా ప్రభావం అని పరిశ్రమ వర్గాలు అనుకుంటున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా మరియు టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది.
అయితే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన మాత్రమే దక్కించుకుని సో సో గా థియేటర్ లలో నడుస్తోంది. మొదటి వారంలో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినా రెండవ వారం డల్ అయినట్లు తెలుస్తోంది. అయినా కానీ రిపీట్ గా ప్రేక్షకులు వస్తుండడంతో మళ్లీ వసూళ్లు పెరుగుతున్నాయి అని సమాచారం. దీని ప్రభావం వలన ఈ రెండు సినిమాలకు బుకింగ్స్ ఆశాజనకంగా లేవట. మరి రిలీజ్ అయిన తర్వాత టాక్ ను బట్టి అయినా బుకింగ్స్ పెరుగుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇలా ప్రభాస్ మరియు సూర్య లకు తమిళనాడు ప్రేక్షకులు షాక్ ఇచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి