తమిళంలో స్టార్ హీరోగా ఎదిగిన ధనుష్ ఇటీవల కాలంలో పరస సినిమాలు చేస్తున్నాడు. మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ ఈ స్థాయికి చేరుకున్న ఈ హీరో స్వశక్తితో ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈ మధ్య ఆయన నుంచి మంచి సినిమాలు రావడం లేదనే చెప్పాలి. అయితే ఆయన నటించిన గత నాలుగైదు సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. దాంతో ఇప్పుడు ప్రేక్షకులను అలరించే సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ నటించిన జగమే తంత్రం సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీని ప్రోమోలు హాలీవుడ్ రేంజ్ లో కనిపించే సరికి ఈ చిత్రం భారీ స్థాయిలోనే ఉండబోతుంది అని అనుకున్నారు. కానీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తన సినిమా బాగా లేకపోతే ఓ టి టీ కి ఇచ్చి వదిలించుకుంటారు అనే విమర్శలు వ్యక్తం  అవుతున్న నేపథ్యం లో ఇప్పుడు చేసిన మారన్ సినిమాను కూడా ఓ టీ టీ లోనే విడుదల చేశాడు ధనుష్.

మాళవిక మోహనన్ హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ దర్శకత్వం లో రూపొందించిన ఈ సినిమా ఇటీవలే హాట్ స్టార్ లో విడుదల అయ్యింది.  షూటింగ్ దశలో ఉండగానే ఈ చిత్రానికి ఓటిటీ డీల్ కుదిరింది. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ముందే కుదిరిన ఒప్పందం మేరకు హాట్ స్టార్ లో విడుదల చేశారని అంటున్నారు. ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా పెద్దగా ఉండదేమో అనిపించింది .అలా సినిమా తో మరొకసారి ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు. ఇలాంటి సినిమాలు చేయడం ఎలా అవుతుంది అని ఆయన పై విమర్శలు చేస్తున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రానికి దండం పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: