మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గని'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గని సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. సినిమా ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్.. తాజాగా ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. 

గని సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మార్చి 17 ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు సినిమా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేశాడు. ఈ సందర్భంగా గని సినిమా ట్రైలర్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు. గని సినిమాలో బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్ పర్ఫామెన్స్ ఆడియన్స్ మెస్మరైజ్ చేస్తుందని.. మునుపెన్నడూ చూడని వరుణ్ తేజను ఈ సినిమాలో చూస్తారని ధీమా వ్యక్తం చేశాడు దర్శకుడు కిరణ్ కొర్రపాటి. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. 

ఇక వేసవి కానుకగా ఈ సినిమాని ఏప్రిల్ 8 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో వరుణ్ తేజ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ లు ఆడియన్స్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ అంటోంది. ఇక గని సినిమా ట్రైలర్ రిలీజ్ అప్డేట్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. సినీ హీరో జగపతిబాబు, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ అగ్ర నటుడు సునీల్ శెట్టి వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాను అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ మరియు సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: