నందమూరి బాలకృష్ణ తమ సినిమాలకు పని చేసే దర్శకుల పట్ల ఎంత నమ్మకంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఒకసారి ఒక దర్శకుడు చెప్పిన సినిమా కథకు మళ్లీ ఇలాంటి వంకలు ఇబ్బందులు పెట్టకుండా ఆయన చెప్పిన ప్రతి సీన్ కూడా చేస్తూ ఉంటాడు. ఆ విధంగా దర్శకుల హీరోగా చాలా సార్లు బాలకృష్ణ వారి ప్రశంసలను అందుకున్నాడు. నిర్మాతల విషయంలో కూడా ఆయన మంచి పద్ధతితో ఉంటూ వారికి అన్ని విధాలుగా సహాయపడుతూ ఉంటాడు. అలా తన సినిమాకు పనిచేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ ను కూడా ఎంతో గౌరవించే ఆయన మరొకసారి దర్శకుల పట్ల తనకున్న నమ్మకాన్ని వ్యక్తపరిచాడు.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ ఈ చిత్రం తర్వాత చేయబోయే సినిమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అఖండ విజయం తర్వాత ఏమాత్రం తగ్గని విధంగా సినిమా చేయాలని చూస్తున్న ఆయన ఓ యువ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉండగా దాదాపుగా అదే నిజం అని నందమూరి బాలకృష్ణ సన్నిహితులు వెల్లడిస్తున్నారు. 

టాలీవుడ్ లో కమర్షియల్ కామెడీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం చేస్తున్న ఎఫ్3 సినిమా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ను కలిసి ఓ కథ వినిపించాలని ఆయన ప్రయత్నాలు చేయగా బాలకృష్ణ మాత్రం ఈ దర్శకుడు చెప్పే కథ విన అవసరం లేదని షూటింగ్ డేట్ టైం చెప్పండి చాలు అని అంటున్నాడట. ఆ విధంగా బాలకృష్ణ నమ్మకాన్ని సంపాదించుకున్న ఈ దర్శకుడు ఎ లాంటి సినిమాను చేస్తాడో చూడాలి. బాలయ్య తో సినిమా అనగానే అందరు భారీ మాస్ మసాలా చిత్రాన్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: