టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కెరియర్ ను చిన్న పాత్రల ద్వారా మొదలు పెట్టి ఆ తరువాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు, పెళ్లి చూపులు సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి,  గీతా గోవిందం సినిమాలు బ్లాక్ బస్టర్ విజయలను సాధించడంతో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు.   ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ,  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ మూవీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు,  ఈ సినిమా పూర్తి కాగానే విజయ్ దేవరకొండ మరో సారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన మూవీ లో నటించబోతున్నాడు.

  మొదట జనగణమన సినిమాలో  మహేష్ బాబు నటించబోతున్నారని వార్తలు వచ్చాయి,  కానీ చివరకు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే,  ఇది ఇలా ఉంటే శివ నిర్వాణ,  నాని హీరోగా నటించిన నిన్ను కోరి  సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు, ఆ తర్వాత శివ నిర్వాణ 'మజిలీ'  సినిమాకు దర్శకత్వం వహించాడు,   అయితే ఆ తర్వాత టక్ జగదీష్ సినిమాతో ఈ దర్శకుడు ప్రేక్షకులను నిరాశ పరిచాడు.  అయితే తనకు ఎంతో అచ్చి వచ్చిన ప్రేమ కథతోనే శివ నిర్వాణ మరో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి,  విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న  సినిమాలో సమంత హీరోయిన్ గా నటించబోతున్న వార్తలు వస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే  ఈ మూవీ కశ్మీర్‌ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీ అని, విజయ్‌ దేవరకొండ ఇందులో మిలటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: