ప్రభాస్ హీరోగా ఇప్పటివరకు మంచి మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే భారీ చిత్రాలను చేయబోతున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను అందుకున్న తొలి హీరోగా ప్రభాస్ భారీ స్థాయి ఇమేజ్ ను కలిగి ఉన్నాడు. ఆ స్టార్ డమ్ ను బట్టి ఇప్పుడు భారీ చిత్రాలను చేస్తున్నాడు. గతంలో ఆయన సినిమాలు చేసే విషయంలో అందరికీ ఎంతో సహకరిస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా నిర్మాతల ఫ్రెండ్లీ హీరోగా ఆయన ప్రశంసలు అందుకుంటారు. ఆయనతో పనిచేసిన ఎవరైనా కూడా ప్రభాస్ వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు.

తన సినిమా ఫ్లాప్ అయిన సందర్భాలలో నిర్మాతకు ఆయన ఇచ్చే ధైర్యం అంతా ఇంతా కాదు. మరొక సినిమా పిలిచి ఇచ్చి మరీ నిర్మాతను కోలుకునేలా చేసే వాడు ప్రభాస్. అలా ఓ నిర్మాత విషయంలో ఆయన ఓ మంచి పని చేసి ఆ నిర్మాత కోలుకునేలా చేశాడు. ఆయన ఎవరో కాదు దిల్ రాజు. వరుస భారీ సినిమాలను తెరకెక్కించే దిల్ రాజు ప్రభాస్ తో మొట్టమొదటిసారిగా మున్నా అనే సినిమా చేశాడు. వంశీ పైడిపల్లి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయవంతం కాలేదు నిర్మాతకు భారీ నష్టాన్ని మిగిల్చింది.

ఈ నేపథ్యంలో లో నిర్మాతతో మరొక సినిమా చేస్తానని మాట ఇచ్చిన ప్రభాస్ ఆ మాట నిలబెట్టుకునే విధంగా మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాను చేసి ఆ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. అలా వచ్చిన నష్టాలను ఈ సినిమాతో రాబట్టుకుని మంచి లాభాలతో ఉండి ఇప్పుడు దేశం గర్వించదగ్గ సినిమాలను నిర్మిస్తున్నాడు దిల్ రాజు.  ఈయన అనే కాదు చాలా మంది ప్రొడ్యూసర్ల భవిష్యత్తును మార్చాడు ప్రభాస్. ఇప్పుడు కూడా ఈ నిర్మాత తో కలిసి ప్రభాస్సినిమా చేయడానికి రంగం సిద్దం చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న ప్రభాస్నిర్మాత తో కలిసి అదే దర్శకుడితో మరో సినిమా చేయబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: