మొదట్లో ఒక కథ రాసుకునేటప్పుడు ఒక హీరో అని అనుకోవడం కొన్ని కారణాలవల్ల మరో హీరోతో సినిమా చేయడం ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమా మంచి హిట్ సాధించడం ఇండస్ట్రీలో జరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం.ఇకపోతే రాజమౌళి వంటి దర్శకులు రాసుకునే భారీ కథలకు సాధారణంగా మొదటే హీరోని ఫైనలైజ్ చేసుకుంటారు. అయితే అప్పుడు వాళ్లకు తగ్గ ఎలివేషన్స్ చేయటానికి వీలుంటుందని వారి అభిప్రాయం.కాగా  బాహుబలి కథ అప్పట్లో ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకునే రాసారు అంటారు.ఇక అదే విధంగా ఆర్.ఆర్. ఆర్ కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లను దృష్టిలో పెట్టుకునే మొదటి నుంచే రాసారా అంటే కాదనే చెప్పాలి.

అయితే ఎవరిని దృష్టిలో పెట్టుకుని విజయేంద్రప్రసాద్ గారు ఆ స్టోరీని కన్సీవ్ చేసారు.తాజాగా  ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిత్ర కధా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడారు. అయితే ఆయన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని అడిగారు.ఇక  దానికాయన సమాధానం ఇచ్చారు.ఇకపోతే మొదట తాము కథ అనుకున్నప్పుడు ఏ హీరోలను అనుకోకుండా ముందుకు వెళ్లాలనుకున్నామని చెప్పారు.అయితే  ఆ తర్వాత రజనీకాంత్- అర్జున్, సూర్య-కార్తీ ఇలా చాలా కాంబినేషన్స్ అనుకున్నాము కానీ ఫైనల్ గా ఈ ఇద్దరి హీరోల దగ్గరికే వచ్చి ఆగామన్నారు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఎంచుకోవటానికి కారణం...ఇద్దరు హీరోలు నిజ జీవితంలో మంచి స్నేహితులైతే తెరపై అనుబంధం ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అవుతుందనే ఉద్దేశ్యంతో చేసామన్నారు ఈయన.

ఇదిలా వుండగా ఈ సినిమాలో ఆలియాభట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు..అంతేకాదు  అజయ్ దేవగన్, శ్రియ కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు . ఇకపోతే  ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటించారు.అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. కాగా  యూఎస్‌లో ఎన్టీఆర్ ఓ అభిమాని ఏకంగా థియేటర్ నే బుక్ చేయడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR