మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అలియా భట్ ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా డి వి వి దానయ్య నిర్మాత గా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమా ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ రోజు  థియేటర్ లలో విడుదలయ్యింది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని  అప్పట్లో జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది,  కాక పోతే కొన్ని అని వార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది.  ఇలా ఎన్నో వాయిదాల తర్వాత ఈ రోజు ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్ లాల్ ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది.

  అయితే ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది,  ఇది ఇలా ఉంటే రాజమౌళి మూవీ లో పాటలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో మనందరికీ తెలిసిందే. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీ లో కూడా నాటు నాటు సాంగ్ ఏ రేంజ్ పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే, సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం విడుదల చేసిన  సాంగ్ లోనే  రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఈ పాట కు వేసిన స్టెప్ లు  ఫుల్ ఫేమస్ అయ్యయి.  ఇది ఇలా ఉంటే ఈ రోజు థియేటర్ లో ఈ సాంగ్ ను చూసిన ప్రేక్షకులు ఆనందంతో ఉన్నట్లు సమాచారం,  ఈ సాంగ్ మొత్తం కూడా అదిరిపోయే గ్రేస్ తో ఇద్దరు హీరోలు డాన్స్ చేసినట్లు తెలుస్తోంది.  ఇలా నాటు సాంగ్ ఈ సినిమా కి ఒక స్పెషల్ అని తెలుస్తోంది, ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: