సంతోషం వచ్చినా బాధ వచ్చిన ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది.. సంతోషాన్ని బాధను పంచుకోవాలి అనిపించేది స్నేహితులతోనే.. స్నేహితుడు అంటే రక్త సంబంధీకులు కానక్కర్లేదు కళ్ళల్లో చూసి మనసులో ఉన్న బాధను అర్థం చేసుకొని ఆ బాధను చెప్పేలోపే ఓదార్చే ఒక మంచి స్నేహితుడు ఉంటే చాలు జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. ఇక ఇలాంటి స్నేహమే అటు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ల మధ్య ఉంది అని వీరిద్దరూ ఎన్నోసార్లు నిరూపిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరి మాటా వినడు. తన రూటే సపరేటు అని అంటూ వుంటారు చాలామంది.


 కానీ స్నేహితుడు త్రివిక్రమ్ మాట మాత్రం పవన్ కళ్యాణ్ వింటారు అని అందరికీ తెలుసు. ఇకపోతే ఇటీవలే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ తన స్నేహితుడు త్రివిక్రమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు త్రివిక్రమ్ మధ్య ఎన్నో విషయాల్లో అభిప్రాయాలూ ఒకేలా ఉంటాయి. అని కానీ ఒక్క విషయంలో మాత్రం తేడా వస్తుంది అంటూ పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు. అదే పుస్తకాల విషయంలో అంటూ తెలిపాడు.


 త్రివిక్రమ్ నేను ఇద్దరం కూడా పుస్తకాల పురుగులమే. ఒకసారి ఒక పుస్తకం చదవడం మొదలు పెట్టాము అంటే అది పూర్తయ్యేంత వరకూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ చెప్పారు పవన్ కళ్యాణ్. అదేసమయంలో ఇటీవలే జరిగిన ఒక సంఘటన గురించి పంచుకున్నారు. నా దగ్గర ఉన్న పుస్తకాల్లో ఒకటి త్రివిక్రమ్ కు బాగా నచ్చింది. ఇవ్వమని అడిగారు. కానీ నేను ఇవ్వలేదు. కావాలంటే ఒక సినిమా ఫ్రీగా అయిన చేస్తాను. కానీ ఆ పుస్తకం మాత్రం ఇవ్వను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్తా హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఇక పవన్ కళ్యాణ్ మాటలను బట్టి త్రివిక్రమ్ తో ఆయన స్నేహబంధం ఎంత బలంగా ఉంది అన్నది అర్ధమవుతుంది అని అనుకుంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: