ఇలా మూడు ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఈ సినిమా కోసం ఏళ్ల తరపడి పడిగాపులు కాసేలా చేశాయి. ఎన్ని సార్లు వాయిదా పడినా అసంతృప్తి చెందారే తప్ప సినిమా పై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ప్రేక్షకుల నిరీక్షణ ఫలించింది ఈ సినిమా రానే వచ్చింది. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ప్రేక్షకులను అట్రాక్ట్ చేసిన ఆ మూడు ఎలిమెంట్స్ విషయానికి వస్తే... మొదటగా పాన్ ఇండియా స్థాయిలో తీసిన ఈ చిత్రం చాలా బాగుంది, జక్కన్న దర్శకత్వం చాలా క్లియర్ గా, నీట్ గా ఫెంటాస్టిక్ అనిపించింది. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇరు హీరోల అభిమానులు ఫుల్ హ్యాపీ. ఇక రెండవది...ఇద్దరు బడా హీరోల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో ఏ హీరోకి ఎక్కువ ప్రాముఖ్యత అంటే, చాలా మంది రామ్ చరణ్ ని కాస్త ఎక్కువగా హైలెట్ చేశారు అంటున్నారు.
కానీ, నిజానికి రెండు పాత్రలు కూడా అద్భుతమైనవి, ఛాలెంజింగ్ రోల్స్ అనే చెప్పాలి. ఇద్దరు కూడా ఒకరిని మించి ఒకరు నటించారు, ఇక్కడ ఎవరిని ఉద్దేశపూర్వకంగా డైరెక్టర్ హైలెట్ చేసినట్లు కనిపించలేదు, ఇద్దరికీ స్ట్రాంగ్ లీడ్ రోల్స్ ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ మాత్రం మరో మెట్టు ఎక్కి తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఒకే ఒక్క పాటతో తనకు తానే హైలెట్ అయిపోయారు ఈ యంగ్ హీరో. కొమరం భీముడో అనే పాటలో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, అతని నటన గురించి ఎంత చెప్పినా తక్కువే సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ పాట ఒకటే మరో ఎత్తు అని చెప్పేలా తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు తారక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి