టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. 14 రీల్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ తో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా యూట్యూబ్ లో కూడా దుమ్ము రేపాయి. కళావతి అనే పాట తో పాటు ఇటీవల విడుదలైన పెన్ని సాంగ్ మహేష్ ఫాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.ఎట్టకేలకు సర్కారు వారి పాట షూటింగ్ లో తన పార్ట్ పూర్తవడంతో మహేష్ బాబు విశ్రాంతి తీసుకోబోతున్నారట. ఈ మేరకు తన తర్వాత సినిమాకి దాదాపు రెండు నెలల గ్యాప్ తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే తన నెక్స్ట్ మూవీ కి దొరికిన గ్యాప్లో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అప్పటిలోగా మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదలై ఆ సినిమా రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ని త్రివిక్రమ్ దర్శకత్వంలో సెట్స పైకి తీసుకెళ్తారు.

వీలైనంత త్వరగా ఆ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఇక వేసవి కానుకగా సర్కారు వారి పాట మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనమివ్వనున్నారు. అంతేకాదు సినిమాలో మహేష్ రెండు వేరియేషన్స్ కలిగిన పాత్రలను పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒక పాత్రలో మహేష్ బ్యాంకు అధికారిగా కనిపించనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: