ప్రభాస్ తాజాగా నటించిన  రాధే శ్యామ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది,  ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాను యు వి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో  నిర్మించారు, యు వి క్రియేషన్స్ నిర్మాతలు రెబల్ స్టార్ ప్రభాస్ చిన్ననాటి స్నేహితులు,  ఆ కారణం గానే బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాహో సినిమాకు నిర్మించే అవకాశం యు.వి.క్రియేషన్స్ వారికి దక్కింది.  ఎంతో భారీ బడ్జెట్ తో యు వి క్రియేషన్స్ వారు సాహో సినిమాను తెరకెక్కించారు,  ఈ సినిమా బాలీవుడ్ లో మినహాయిస్తే ఇతర ఇండస్ట్రీ లో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.  

సాహో సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ యు వి క్రియేషన్స్ వారికి నష్టాలు మాత్రం తెచ్చి పెట్టలేదు,  ఇది ఇలా ఉంటే సాహో సినిమా తర్వాత యు వి క్రియేషన్స్ వారు ప్రభాస్ హీరోగా మరో సినిమాను తెరకెక్కించారు,  ఆ సినిమానే రాధే శ్యామ్.  ఈ సినిమాను యూ వి  క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు,  ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు,  అవుట్ అండ్ అవుట్ ప్రేమ కథతో తెరకెక్కిన రాధే శ్యామ్  సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  ఇది ఇలా ఉంటే రాధే శ్యామ్ సినిమా ద్వారా యు వి క్రియేషన్స్ వారు వంద కోట్ల వరకు నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి,  అయితే ఇలా పెద్ద మొత్తంలో నష్టాలను చూసిన స్నేహితుల కోసం ప్రభాస్ మరో మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.  ఫుల్ సక్సెస్ లో ఉన్న దర్శకులతో యు వి క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ కొత్త సినిమాలు  చేయనున్నట్లు తెలుస్తోంది,  అందులో భాగంగా గా ప్రభాస్,  కొరటాల శివ ను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.   అలాగే మారుతి దర్శకత్వంలో యు వి క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది,  ఇలా స్నేహితుల కోసం ప్రభాస్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: