శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఒక అమ్మాయి చేతికి రింగ్ తొడిగి ఇంకా అందరి సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. దీంతో సుడిగాలి సుధీర్ రష్మీ ని మోసం చేశాడా అని చర్చ మొదలైంది. సుడిగాలి సుదీర్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పేరు తేజస్విని నాయుడు. పక్క హైదరాబాదీ అయినా ఈ అమ్మాయి చదువు కూడా హైదరాబాద్లోనే పూర్తిచేసింది. ప్రస్తుతం మోడలింగ్లో కొనసాగుతోంది. సినిమా అవకాశాల కోసం చూస్తున్న ఈ అమ్మడు ఇటీవల సుడిగాలి సుధీర్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇటీవలే ఉగాది సందర్భంగా ఈ సందర్భంగా ఈ టీవీలో ప్రసారమైన అంగరంగ వైభవంగా అనే కార్యక్రమంలో కి మరోసారి ఎంట్రీ ఇచ్చింది సుధీర్ ఎంగేజ్మెంట్ చేసుకున్న తేజస్విని నాయుడు. సరే వచ్చింది కూర్చుంది కాసేపు నవ్వుకుంది పోయింది అన్నట్లుగా ఉండకుండా జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుల్ కు ప్రపోజ్ చేసింది. నువ్వు నాకు నచ్చావు అంటూ చెప్పేసింది. దీంతో ఇది చూసి అభిమానులు అందరూ కూడా కాస్త చిరాకు పడుతున్నారు. రేటింగ్ కోసం ఏమైనా చేస్తారా అని అనుకుంటున్నారు. మొన్న సుడిగాలి సుధీర్ తో ఎంగేజ్మెంట్ చేసినట్లు చూపించి ఇప్పుడు ఇమాన్యుల్ కు అదే అమ్మాయి తో ప్రపోజ్ చేయిస్తారా. ఇది ఏమైనా బాగుందా అంటూ ప్రశ్నిస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి