ఇది ఈ చిత్రం ముంబై మాఫియా క్విన్ గంగుబాయి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ఉంది. ఇక ఈ చిత్రాన్ని బన్సాలి, జయంతి లాల్ గడా సంయుక్తంగా నిర్మించారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఈ సినిమా ఎన్నో సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కాగా ఈ చిత్రం మంచి విజయాన్ని చేకూర్చుతుంది. ఇక ఈ సినిమాని అన్ని భాషల్లో విడుదల చేశారు. దీంతో ఆలియా భట్ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ చిత్రంలో ఆలియా భట్ వన్ మ్యాన్ షో చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈమె నటనకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. ఇక ఈ చిత్రం ఓ టి టి లో ఈనెల 22వ తేదీన నెట్ ఫ్లెక్స్ లో విడుదల కాబోతుంది.
ఇక ఈ సినిమాతో తన ఇమేజ్ కాస్త పెరగడంతో..RRR చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన ఇమేజెస్ చాటుకుంటోంది. ఇక ఈ రెండు చిత్రాలతో తెలుగులో మరిన్ని అవకాశాలు తెచ్చి పెట్టేలా కనిపిస్తున్నాయి ముద్దుగుమ్మకి. ఇక డైరెక్టర్ బన్సాలీ దృష్టిలో పడితే ఎవరైనా స్టార్ హీరోయిన్ కావాల్సింది అనే విషయాన్ని మరొకసారి నిరూపించారు ఈయన. అయితే ఈ చిత్రం విడుదల చేయకూడదని కొంత మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఈ విషయాలను పట్టించుకోకుండా విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు చిత్ర బృందం. ఇక ఇందులో అజయ్దేవగన్, ఇమ్రాన్ హస్మి కీలకమైన పాత్రలో కనిపించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి