టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ 'అల.. వైకుంఠపురములో' సినిమా తరువాత ఇప్పటివరకు మరో సినిమాను కూడా మొదలుపెట్టలేదు. మధ్యలో 'భీమ్లానాయక్' సినిమాకు మాటలు-స్క్రీన్ ప్లే కూడా అందించారు.

త్వరలోనే త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట.. షూటింగ్ లో భాగంగా త్రివిక్రమ్ ఓ భారీ సెట్ నుకూడా నిర్మించబోతున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో దాదాపు ఎనిమిది ఎకరాల్లో మాసివ్ సెట్ ను నిర్మించబోతున్నారట.

 

ఇదొక కాలనీ సెట్ అని సమాచారం.. సినిమాలో ఎక్కువ భాగం ఈ కాలనీ సెట్ లోనే చిత్రీకరించబోతున్నారట.. అందుకే ఎంతో లావిష్ గా ఈ సెట్ ను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. జూన్ నెల నుంచి మహేష్ బాబు ఈ సెట్ లో జాయిన్ కానున్నారట. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించబోతున్నారట.

 

తమన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం నటీనటులను ఎన్నుకునే పనిలో పడ్డాడు. పేరున్న ఆర్టిస్ట్ లను ఈ సినిమా కోసం ఎన్నుకుంటున్నారట.. ఇక మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా మే 12న ప్రేక్షకుల ముందుకు రానునట్లు దర్శకనిర్మాతలు అనౌన్స్ కూడా చేశారు.మరి చూడాలి మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. ఖలేజా సినిమా తరువాత ఇప్పటికి కుదిరిన ఈ కాంబినేషన్ ఎంతో ఆసక్తి పెంచుతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: