మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో రూపొందుతున్న వాల్తేరు వీరన్న( టైటిల్ అఫిషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది) సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్న విషయం తెల్సిందే.సినిమాలో రవితేజకు జోడీగా హీరోయిన్ కూడా ఉంటుందని.. ఆయనది గెస్ట్ రోల్ అయినా కూడా సినిమాకు అత్యంత కీలకమైన రోల్ అని.. కాస్త ఎక్కువ స్క్రీన్ స్పేస్ అనేది ఉంటుందని మేకర్స్ నుండి సమాచారం అందుతోంది.ఈ సమయంలో మాస్ మహారాజ్ రవితేజ ఇతర సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఖిలాడి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ మరో వైపు అతి త్వరలోనే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో సందడి చెయ్యడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత ధమాకా సినిమా కూడా రావాల్సి ఉంది. ఈ రెండు కాకుండా రాక్షసుడు ఇంకా టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా చేస్తున్నాడు.



మొత్తం నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన రవితేజ మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ సమయంలోనే నటసింహం బాలయ్య తో కూడా సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాల కృష్ణతో ఏదో గెస్ట్ రోల్ కాకుండా ఒక ఫుల్ లెంగ్త్ రోల్ లోనే రవితేజ నటించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అనేది అందుతోంది.అపజయం ఎరుగని అనీల్ రావిపూడి వీరిద్దరి కాంబో మల్టీ స్టారర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. ఆ మధ్య అన్ స్టాపబుల్ షో లో పాల్గొన్న రవితేజ తో బాలయ్య చాలా ముచ్చట్లు పెట్టాడు. ఆ సమయంలోనే వీరు ఇద్దరు కలిసి నటించాలని భావించారు. ఇద్దరు కలిసి మంచి కథ వస్తే తప్పకుండా నటిస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న బాల కృష్ణ ఆ తర్వాత అనీల్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: