జక్కన్న సృష్టించిన మరో అద్భుతం "ఆర్ ఆర్ ఆర్" మూవీ బజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రికార్డ్ స్థాయిలో దూసుకుపోతున్న ఈ చిత్రం గురించి అభిమానులు, మూవీ లవర్స్ కాదు బడా బడా సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ దర్శకుడు రాజమౌళిని , నటీనటులు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్, ఎలిజిబిత్ లను భళా భళి అంటూ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కన్నడ నటుడు యశ్, మెగా ఇంటి కోడలు ఉపాసనా వంటి పలువురు సెలబ్రిటీలు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా ..తాజాగా బాహుబలి కూడా ఈ పాన్ ఇండియా మూవీ గురించి పెదవి విప్పారు.

అయితే రెండు రోజులకు ముందుగా విడుదల అయిన మరో పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ 2 ఆర్ ఆర్ ఆర్ కన్నా బాగుందని రివ్యూలు వస్తున్న నేపధ్యంలో ఆ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే రాజమౌళి ప్రశాంత్ నీల్ ఒకే అభిరుచి కలిగిన డైరెక్టరు లని తెలుస్తోంది. ఎందుకంటే వీరిద్దరూ కూడా ఏవైతే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి ఆ విషయాలపైన ఎక్కువ శ్రద్ద చూపిస్తారు. అందులో ముఖ్యంగా సినిమాకు ఆయువు అయిన కథ, హీరో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సెంటిమెంట్ లాంటి అంశాల పట్ల సీరియస్ గా ఉంటారు.

కానీ ఆర్ ఆర్ ఆర్ విషయంలో మిగిలిన అన్ని విషయాలు సోసోగా ఉన్నా కథ బలంగా లేకపోవడం, మరియు ఎప్పుడూ రాజమౌళి సినిమాలో డైలాగులే ప్రధాన బలంగా ఉండేది. కానీ అవే ఇందులో లోపించాయి. ప్రధానమైన మైనస్ గా మారింది. అదే కేజిఎఫ్ విషయానికి వస్తే కథ బలంగా ఉండడం, హీరో ఎలివేషన్ సీన్ లు అన్నీ ఆకట్టుకోవడం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగులు బిగ్గెస్ట్ ప్లస్ గా మారి సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంలో ప్రధాన కారణాలు అయ్యాయి. ఇక టాలీవుడ్ లో రాజమౌళికి ఒక పోటీ ఏర్పడింది అని చెప్పాలి. ముందు ముందు తీయబోయే సినిమాలు విషయంలో రాజమౌళి ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.









మరింత సమాచారం తెలుసుకోండి: