విజయ్ దేవరకొండ.. ఈ పేరుకు యూత్ లో మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే.. అందుకే యూత్ స్టార్ అయ్యాడు.అతని సినిమాలకు కూడా మంచి డిమాండ్ వుండేది ఒకప్పుడు.. లవ్, ఎమొషనల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కెరాఫ్ గా విజయ్ పేరు నిలిచించి..ఈ మధ్య కొత్త కథలతో సినిమాలు చేస్తున్నా కూడా ఇతడికి పెద్దగా కలిసిరాలేదు.. థియెటర్లలో విడుదల సినిమా కొద్ది రోజులకే దుకాన్ సర్దెస్తున్నారు.. ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకొని మరి లైగర్ సినిమాను చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాను విడుదల చెయాలనె ఆలోచనలో చిత్రయూనిట్ వున్నారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్‌ దర్షకత్వంలో జనగణమన సినిమాను చేస్తున్నారు. ఆ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెల్లాలని భావిస్తున్నారు..


ఇకపోతే విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్లో మరో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే..ఆ సినిమాలో బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత విజయ్ కు జోడిగా నటిస్తూన్నారు.గతంలో వీరిద్దరు కలిసి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించారు.ఈ సినిమా వల్ల మంచి క్రేజ్ ను అందుకున్నారు.ఇప్పుడు ఈ జోడి రిపీట్ అవ్వడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది..ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింద నే వార్తలు ఫిలిం ఇండస్ట్రీ లో చక్కర్లు కోడుతుంది..


ఈనెల 21నే ఈ సినిమాను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ కానుంది. ఆ తర్వాత ఇదే నెల 23నుంచే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.ఫస్ట్‌ షెడ్యూల్‌ను కశ్మీర్‌లో ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో విజయ్‌ ఆర్మీ అధికారిగా కనిపించనున్నట్లు రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి.. మజిలీ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించింది. నాగచైతన్య కు జోడిగా నటించింది. ఆ సినిమాకు శివ నిర్వాణ దర్షకత్వం వహించారు.మజిలీ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత చేస్తున్న ప్రాజెక్ట్‌ కావడం, విజయ్‌ ఇందులో హీరోగా చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది..ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: