టాలీవుడ్ లో సీనియర్ నటులలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. దాదాపుగా ఇప్పటికి బిగ్ స్క్రీన్ మీద కనిపించగా 2 సంవత్సరాలు అవుతున్నది. చివరిగా వెంకి మామ సినిమాలో మాత్రమే కనిపించారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఓటిటీలో విడుదల చేయడం జరిగింది. దృశ్యం-2, నారప్ప వంటి చిత్రాలు విడుదల చేయగా ఈ రెండూ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా థియేటర్లలో సినిమాని విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇక ఆ చిత్రమే F-3. ఈ సినిమాని మూడేళ్ల కిందట బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన..f-2 చిత్రానికి సీక్వెల్ గా నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నది. చివరిగా ఈ చిత్రం లో ఒక స్పెషల్ పాటలో పూజా హెగ్డే కూడా నటిస్తున్నది. ఈ చిత్రం కూడా మొత్తం డబ్బు అనే ఒక కాన్సెప్ట్ ఒక కథ ఆధారంగా తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ చిత్రం కూడా మంచి కామెడీ చిత్రంగా ఉండబోతోంది. ఇందులో వెంకీ రేచీకటి బాధితుడిగా కనిపించబోతున్నారు.

ఇక ఈ సినిమాలోని చివరిగా 20 నిమిషాలు వెంకటేష్ కామెడీ ఈ చిత్రానికి హైలెట్గా నిలవనున్నట్లు సమాచారం. ఇక వెంకటేష్ కి జతగా వరుణ్ తేజ్ కూడా కలిసి కామెడీ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా 40 రోజులు మాత్రమే ఉండగా.. కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి ట్రైలర్ కూడా విడుదల చేయలేదు. ఇక ఇందులో రాజేంద్ర ప్రసాద్, సునీల్ ,సోనాలి చౌహాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం మే 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా గురించి వెంకటేష్ ఎక్కడ కూడా ఏ విధంగా ప్రస్తావించలేదు. అయితే ఈ సినిమా సస్పెన్స్ అంత వెండితెరపై చూడాలని వెంకటేష్ భావిస్తున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: