ఆచార్య సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా...  ఎప్పుడు సినిమాని థియేటర్ లలో చూద్దామా అని మెగా అభిమానులతో పాటు,  సామాన్య సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.  అలా ఆచార్య సినిమా కోసం ప్రేక్షకులు అంతలా ఎదురు చూడడానికి ప్రధాన కారణం...  మొదటిసారి నిజజీవితంలో తండ్రీకొడుకులు అయిన చిరంజీవి , రామ్ చరణ్ కలిసి ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో ఆచార్య సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడు థియేటర్ లలో చూద్దామా అని ఎంతో మంది మెగా అభిమానులతో పాటు ,  సామాన్య సినీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.  

ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమాకు ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'సిద్ధ' అనే పాత్రలో కనిపించబోతున్నాడు.  ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా కనిపించబోతోంది.  ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించాడు.  మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలను ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేయగా ఆ సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే ఆదరణ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమా ఈ నెల 29 వ తేదీన విడుదల కాబోతుంది.  

సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఆచార్య చిత్ర బృందం లోని సభ్యులు వరస పెట్టి టీవీ ఛానల్ ఇంటర్వ్యూలలో , సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను  ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు.  ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'  సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.  మెగాస్టార్ చిరంజీవి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...  ఆచార్య సినిమా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు.  ఇది ఒక ఫుల్ లెంత్ కమర్షియల్ సినిమా.  ఈ సినిమా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ని ఇస్తుంది అని మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'  సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: