ఈ కారణంగానే నెల్సన్ తో మరో సినిమా చేయడానికి సన్ పిక్చర్స్ వారు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన కొన్ని సన్నాహాలు కూడా చకచకా జరుగుతున్నాయి. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి.. సంగీతాన్ని అనిరుధ్ సమకూర్చుతున్నారు. కెరీర్ పరంగా రజనీకాంత్ కు 169 వ చిత్రం. అయితే అభిమానులు మాత్రం బీస్ట్ కారణంగా నిరాశతో ఉన్నట్లుంది. అయితే ఈసారి తప్పకుండా ఖుషి చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ నెల్సన్ ఉన్నట్లుగా అందుకోసం ఒక బలమైన కథ తో పాటుగా లేడి విలన్ కూడా దించపోతున్నారు అనే వార్త వినిపిస్తోంది.
ఇక ఆమె ఎవరో కాదు అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ. రజనీకాంత్ రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చిన 1999 లో వచ్చిన నరసింహ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుంది తెలిసిన విషయమే.. ఇక ఈ సినిమాలో నెగటివ్ షేడ్ తో కూడిన నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టింది అని చెప్పవచ్చు. అలాంటి ఒక పవర్ఫుల్ పాత్ర ని డైరెక్టర్ నెల్సన్ మరొకసారి క్రియేట్ చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో మరొకసారి నరసింహ కాంబినేషన్ రిపీట్ కావడం ఖాయమనే అన్నట్లుగా అభిమానులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. నెల్సన్ తీసుకున్న ఈ నిర్ణయం అదరహో అన్నట్లుగా ఉందని చెప్పవచ్చు. అయితే డైరెక్టర్ కేవలం పెట్టాల్సిన దృష్టి అంతా కేవలం స్క్రీన్ ప్లే మీద.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి