మిల్కీ బ్యూటీ తమన్నా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంది. ఇది ఇలా ఉంటే తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ లోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన తమన్నా ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ ను చూపిస్తుంది.  ప్రస్తుతం తమన్నా తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో కథానాయికగా నటిస్తోంది.  

ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఎఫ్ 3 మూవీ లో తమన్నా ,వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఎఫ్ 3 మూవీ లో వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఎఫ్ 3  సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మిల్కీ బ్యూటీ తమన్నా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.  

తాజా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ...  ఇండస్ట్రీకి నేను వచ్చి అప్పుడే ఇంతకాలమైపోయిందా... అని అనిపిస్తోంది. చూస్తు ఉండగానే సీనియారిటీ పెరిగిపోయింది. సీనియారిటీ అనేది బాధ్యతలు పెంచుతుంది.  కెరియర్ ప్రారంభంలో ఎలాంటి పాత్రలు చేసినా ఎవరూ పెద్దగా  పట్టించుకోరు.  కానీ సీనియార్టీ పెరిగిన తర్వాత ఎంచుకునే పాత్రల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.  తమన్నా ఏంటి ఇలాంటి పాత్రలో నటించింది అని ఎవరితో అనిపించుకోకూడదు. అందుకే పాత్రల ఎంపిక విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నట్లు తన తాజా ఇంటర్వ్యూలో తమన్నా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: