దర్శకుడు పరుశురామ్ పెట్లా ,టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట'. వరుస హిట్ చిత్రాలతో ఫుల్ జోష్ పై ప్రిన్స్ మహేష్ బాబు ఈ సినిమాతోను సక్సెస్ ను అందుకుంటారు అని అంతా అనుకుంటున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలయిన పోస్టర్, సాంగ్స్ ఇలా విడుదలయిన ప్రతి ఒక్కటి ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకునేలా ఉంది. అయితే ఇపుడు నిన్ననే ఈ మూవీ ట్రెయిలర్ ను రిలీజ్ చేశారు ఈ మూవీ మేకర్స్. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే మాస్ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా, క్లాస్ ఆడియన్స్ ను ఆకర్షించేలా క్లాస్ , మాస్ కలిపి కొట్టేశారు మహేష్.

ఇందులో మహేష్ డైలాగ్స్ అయితే బాప్ రే...భలే భలే ఉన్నాయి.  యు కెన్ స్టీల్ మై లవ్...నా ప్రేమని దొంగిలించగలవు....యు కెన్ స్టీల్ మై ఫ్రెండ్షిప్ నా స్నేహాన్ని దింగిలించగలవు, బట్ కానీ యు కాంట్ స్టీల్ మై మనీ నా డబ్బును దింగలించలేవు అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో కొత్త లుక్ తో ఆశ్చర్యపరిచారు మహి. అమ్మాయిల్ని , అప్పు ఇచ్చే వారిని పాంపర్ చేయాలి రా... రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు...ఆ నెక్స్ట్ అంటూ మహి చెప్పే డైలాగ్ భలే త్రిల్లింగ్ గా అనిపించాయి.  ఏటి సేస్తరు అంటూ కొత్త స్లాంగ్ తో పలకరించిన తీరు చూస్తుంటే కామెడీ యాంగిల్ కూడా కావలసినంత ఫుల్ గా దొరికే లాగే ఉంది. ఇక ట్రైలర్ లో ఒక డైలాగ్ తన అందం మరియు వయసు గురించి ఉంది. అందుకు మహేష్ తనపైనే సెటైర్ వేసుకున్నాడు. ఈ అందాన్ని మైంటైన్ చేయలేక దూల తీరిపోతోంది అన్న తీరు మహేష్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ కి యాక్షన్, హాస్యం, లవ్ ట్రాక్ ఇలా అన్ని యాంగిల్స్ తో కలిపి  సగటు ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్టైన్మెంట్  ఫుల్ గా దొరికే లాగే ఉందండోయ్.... మహి ఈసారి కూడా మనల్ని మూడు గంటల పాటు తగ్గేదేలే అన్నట్లుగా ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నట్లే ఉంది.  ఇక ఈ సినిమా  ఈ నెల 12 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన కళావతి సాంగ్ అయితే సోషల్ మీడియాలో మోత మోగిస్తోంది. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 150 మిలియన్ పైగా వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ అదే స్పీడ్ తో దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: