ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన దర్శకుడు రాజమౌళి చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' మొత్తానికి మార్చి 25న ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టించింది, కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇరువురు కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఇది. ఇద్దరు అగ్ర హీరోలు , పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కాంబోలో వస్తుండటంతో ఈ మూవీకి మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అయిన అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీంల ఫిక్షనల్ స్టోరీగా 1920 నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా మార్చ్ 15 న విడుదలయి అంచనాలకు మించి ఫలితాలను అందుకున్న విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే డిజిటల్ కు అలవాటు పడ్డ జనాలు ఈ సినిమా ఎపుడెపుడు ఓటిటిలో వస్తుందా అని తెగ వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకునే ఆడియన్స్ కూడా ఓ టి టి రిలీజ్ కోసం వెయిటింగ్. అయితే ఈ సినిమా ఇప్పటికే ఓటిటి లో రిలీజ్ కొరకు విక్రయించగా మొదట జూన్ 3 న ఓ టి టి లో విడుదల చేయాలని అనుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇపుడు అంతకన్నా ముందే మూవీని విడుదల చేయాలని సన్నాహాలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఓటీటీ ప్రసార హక్కులను జీ5, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు దక్కించుకున్నాయి.

మే 20 నుంచి ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమా ప్రసారం కానుందని సమాచారం. అయితే దీనిపై సినిమా మేకర్స్ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా ఓ టి టి  హక్కులను సొంతం చేసుకున్న జీ5, నెట్‌ఫ్లిక్స్ సంస్థ  మే 20 నుండి ఈ చిత్రాన్ని ఓ టి టి లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే థియేటర్ లలో తమ హవా చూపించిన ఆర్ ఆర్ ఆర్, ఓ టి టి లోనూ మంచి వ్యూస్ తో ఇప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: