రష్మిక మందన్నా పాన్‌ ఇండియా హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.. `పుష్ప` ఇచ్చిన హిట్‌తో జోరుమీదున్న ఈ బ్యూటీ గ్లామర్‌ సైడ్‌ కూడా ఓపెన్‌ అవుతున్న సంగతి తెలిసిందే.తాజాగా పొట్టి గౌన్‌లో కనిపించి అందరిని మెస్మరైజ్‌ చేస్తుంది.

 
రష్మిక మందన్న ప్రస్తుతం ముంబయిలో ఉందట . అక్కడ హిందీ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటుందని తెలుస్తుంది. అందులో భాగంగా ముంబయిలోని గుర్గావ్‌ లో గల ఫిల్మ్ నగర్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సందర్భంగా ఆమె ఫోటోలకు చిక్కిందట.. ప్రస్తుతం ఆయా పిక్స్ నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.

 
ఇందులో పొట్టి గౌన్‌లో అందరిని అలరిస్తుంది రష్మిక మందన్నా. క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ బాగా మెస్మరైజ్‌ చేస్తుంది. మోకాళ్లపైకున్న గౌన్‌లో గంతులేస్తూ, చిలిపిగా పోజులిస్తూ కిర్రాక్‌ పుట్టిస్తుందీ ఈ నేషనల్‌ క్రష్‌. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో మాత్రం వైరల్‌ అవుతుండటం విశేషం. కుర్రాళ్లని బాగా టెంప్ట్ చేస్తుంది.

 
రష్మిక మందన్నా ఇలా గ్లామర్‌ పిక్స్ పంచుకుని చాలా రోజులవుతుంది. ఆమె వరుసగా `పుష్ప`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాలతో బాగా సందడి చేసింది. వరుస ఫోటో షూట్లతో తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ బ్యాక్‌ టూ బ్యాక్‌ ట్రీట్‌ ఇస్తుంది.. అంతేకాదు ఒకానొక దశలో హద్దులు కూడా చెరిపేసింది.
 
ఓ మేగజీన్‌ కోసం మరింతగా ఓపెన్‌ అయ్యిందట రష్మిక. నెవర్‌ బిఫోర్‌, ఎవ్వర్‌ ఆఫ్టర్‌ అన్నట్టుగా అందాలు ఆరబోసి తాను కూడా స్కిన్‌ షోకి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇచ్చేస్తుంది.. ఆయా ఫోటోలు కొన్ని రోజులపాటు ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడం గమనార్హం.

 
తాజాగా ముంబయిలో ఆమె కెమెరాలకు చిక్కి కొత్త అందాలను ఆవిష్కరించి, ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ పిక్స్ ని చూసి అభిమానులు తెగ పండగ చేసుకుంటున్నారు. వరుసగా షేర్‌ చేస్తూ బాగా వైరల్‌ చేస్తున్నారు. దీంతో మరోసారి నేషనల్‌ క్రష్‌ సామాజిక మాధ్యమాలను ఊపేస్తుంది.
 
రష్మిక మందన్నా ప్రస్తుతం `పుష్ప 2`సినిమాలో నటిస్తుంది. ఇంకా ఈ చిత్రం అయితే అస్సలు ప్రారంభం కాలేదు. మరోవైపు హిందీలో మూడు సినిమాలతో బిజీ బిజీగా ఉంది. `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై`తోపాటు ఇటీవల `యానిమల్‌` సినిమాకి ఆమె సైన్‌ చేసింది. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందట. దీంతోపాటు తమిళంలో విజయ్‌తో `విజయ్‌66` చిత్రంలో కూడా హీరోయిన్‌గా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: