టాలివుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ గతంలో వచ్చిన సినిమా తో భారీ హిట్ ను తన ఖాతా లో వేసుకున్నారు. ఆ సినిమా తర్వాత అబ్బాయి బాగా బిజీ అయ్యి పోయాడు. అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ మూవీ లో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లోకి తనను తాను మార్చుకున్నాడు. ఇప్పటికే ఏజెంట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమా లో అఖిల్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్ లో వుంటుందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.


ఈ ఏడాది లో ప్రేక్షకుల ముందుకు రావాలని మేకర్స్ బాగా కష్ట పడుతున్నారు.. సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. అయితే అక్కినేని ఫ్యాన్స్ కు మరో న్యూస్ అందింది. అఖిల్ ప్రస్తుతం మాల్దీవుల లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. ఏజెంట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటాడనుకున్న అఖిల్, ఇలా మాల్దీవుల్లో ఏం చేస్తున్నాడని ఆయన అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే షూటింగ్‌ కు చిన్న బ్రేక్ ఇచ్చిన అఖిల్, ఇలా సమ్మర్ వెకేషన్ కోసం మాల్దీవుల కు వెళ్లినట్లుగా తెలుస్తోంది.


కాగా,అక్కడ ఆయన స్విమ్ చేస్తూ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టారు. మాల్దీవులకు వెళ్లినప్పుడల్లో ఇంటికి తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుందని అఖిల్ అన్నారు.ఏజెంట్ సినిమా కోసం బాడీ పెంచేసి బీస్ట్ మోడ్‌ లోకి అఖిల్ మారడం ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సినిమాలో ఆయన్ను చూసేందుకు అఖిల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. అఖిల్ సరసన సాక్షి వైద్యా హీరోయిన్‌ గా నటిస్తోండగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: