బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన సోనాక్షిసిన్హా.. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ పలు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇంస్టాగ్రామ్ లో ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో తన వేలికి ఒక డైమండ్ రింగ్ ఉండడంతో నెటిజన్లు ఈ విషయాన్ని గమనించారు. ఆ ఫోటోలకి ఆమె ఈ విధంగా స్పందించి ఈ రోజు తన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు.. తను కన్న ఒక పెద్ద కల నెరవేరబోతోంది అంటూ పోస్ట్ చేయడంతో ఆ పోస్ట్ చాలా వైరల్ గా మారింది.

అది మీతో షేర్ చేసుకోవాలని చాలా ఆనందంగా కుతూహలంగా ఉందని తెలియజేసింది. ఇది జరిగింది అంటే నేను నమ్మలేకపోతున్నాను అంటూ రాసుకొచ్చింది సోనాక్షి సిన్హా. దీంతో ఆమె వివాహం చేసుకోబోతోంది అనే ప్రచారం మొదలైంది. ఈ కామెంట్లపై సోనాక్షి సిన్హా స్పందిస్తూ ఆమె మాట్లాడుతూ ఓకే ఓకే నేను మిమ్మల్ని బాగా ఆట పట్టించాలని అనుకుంటున్నాను అందుచేతనే ఇలా ఒక అబద్ధం కూడా చెప్పకుండా.. హింట్ కూడా ఇవ్వకుండా ఇలా చేశాను అని తెలియజేసింది.

సోనాక్షి సిన్హా తెలియజేస్తూ నేను చెప్పినట్టుగానే ఆ రోజు నాకు బిగ్ డే.. అంటే తన సొంత నెయిల్ పాలిష్ బ్రాండ్ సోయిజినీ ప్రారంభించే రోజు నాకు ఒక గొప్ప రోజే కదా.. అందమైన నెయిల్స్ ఉన్న ప్రతి అమ్మాయికి కూడా ఇదే చివరి గమ్యం అవుతుంది.. నేను వ్యాపారంలో కొత్తగా అడుగుపెట్టినా.. నా బిగ్గెస్ట్ డ్రీమ్ ఇదే.. అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అని తెలియజేసింది సోనాక్షి సిన్హా. ఈ పిక్స్ తో చివరిగా నా ప్రేమను పంచుకున్న మీరు ఏమనుకుంటున్నారో.. అంటూ లవ్ యు గాయ్స్ అంటూ తెలియజేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: