బోయ సునీత గత కొన్ని రోజులుగా నిర్మాత బన్నీవాసు తో డిబేట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ వాసు తనకు అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేసినట్లు ఆమె ఆరోపణలు చేసింది. అంతే కాదు మా అసోసియేషన్ ముందు అర్ధనగ్నంగా తీవ్రమైన ఆరోపణలు చేసింది. నిన్నటికి నిన్న గీత ఆర్ట్స్ బ్యానర్ ముందు అర్థనగ్నంగా మరొకసారి ప్రదర్శన చేస్తూ గీత ఆర్ట్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఈమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే మరొకసారి బన్నీవాసును ఉద్దేశిస్తూ మరో వీడియో విడుదల చేయడం జరిగింది.. బన్నీ వాసు తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఇవ్వకపోగా పలుమార్లు వ్యక్తిగతంగా వేధింపులకు గురిచేయడంతో అందుకు తట్టుకోలేక ఏకంగా ఐదు సార్లు ఆత్మహత్యా చేసుకోవడానికి ప్రయత్నించినట్లు ఆమె తెలపడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.


మరొకసారి గీతా ఆర్ట్స్ అల్లు ఎంటర్టైన్మెంట్ వారు సీరియల్స్ లో అవకాశాలు రాకుండా చేశారు అని కూడా ఆమె ప్రస్తావించింది. ఇకపోతే ఫైనల్ గా చెప్పదలుచుకున్నది ఏమిటి అనే విషయానికి వస్తే.. ఇంత పెద్ద గొడవ జరిగిన తరువాత తనకు ఎక్కడ సినిమా అవకాశాలు రావు.. అలాగే సీరియల్స్లో కూడా అవకాశాలు రావు. ఇక మూడేళ్ల నుంచి ఒక అమ్మాయి ఒక ప్రొడ్యూసర్ పై ఇంత పోరాటం చేస్తోంది అంటే నిప్పు లేనిదే పొగ రాదు అని గమనించాలి.. అల్లు వారి గీతా ఆర్ట్స్ తో పాటు సినీ ఇండస్ట్రీలో మరో పెద్ద బ్యానర్ నుంచి కూడా సినిమా అవకాశాలు వస్తాయనే నమ్మకం తనకు లేదని. తనకు ఎవరూ ఛాన్స్ ఇవ్వరు అని వేధించడంతో తీవ్ర మానసిక క్షోభకు గురై ఆమె మీడియా ముందుకు వచ్చి తీవ్రంగా  ఎమోషనల్ అయ్యింది. దీనికి ఆధారాలు కావాలంటే 2019 నుంచి ఇప్పటివరకు యూట్యూబ్ లో వచ్చిన అన్ని లింకులో చూడవచ్చు అంటూ ఆమె తెలిపింది. మొత్తానికి ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: