ఎటువంటి అంచనాలు లేకుండా కేజీఎఫ్ చాప్టర్ 1చిత్రం విడుదలయ్యే.. ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇటీవల విడుదలైన కే జి ఎఫ్ టు సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కే జి ఎఫ్ చాప్టర్ వన్ సినిమా ప్రేక్షకులలో రేపిన ఉత్కంఠ కారణంగా కే జి ఎఫ్ టు మొదటి రోజే 164 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టి వరల్డ్ వైడ్ రికార్డు సృష్టించింది. ఇకపోతే కే జి ఎఫ్ 2 సినిమా చివర్లో కే జి ఎఫ్ 3 ఉండబోతోందని కూడా హింట్ ఇచ్చారు కానీ ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు.. ఇందులో నటీనటులు ఎవరు నటించబోతున్నారు.. అనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కానీ తాజాగా సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్ కే జి ఎఫ్ 3 సినిమా విడుదల ఎప్పుడో చెప్పి అభిమానులకు ఆనందాన్ని కలిగించారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  నెక్స్ట్ వీక్ నుంచి లేటెస్ట్ షెడ్యూల్ కూడా మొదలు కాబోతోంది. ప్రభాస్ కూడా షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం సలార్ సినిమా 35 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. నవంబర్ కంతా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత కే జి ఎఫ్ 3 సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తామని ప్రకటించారు చిత్రం యూనిట్. అంతే కాదు 2024 లో కచ్చితంగా సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు గా విజయ్ కిరగందూర్ తెలిపారు..

ఇక ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు హీరో యష్ మరో సినిమా చేస్తారా.. లేదా ఆ సినిమా కోసం ఎదురు చూస్తారా  అనేది ప్రస్తుతానికి రహస్యంగా మిగిలిపోయింది. మొత్తానికి అయితే 2024 నాటికి కే జి ఎఫ్ త్రీ సినిమా చూడబోతున్నామని అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: