అందం మరియు అభినయానికి కాజల్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అని అందరు అభిమానులు అనుకుంటారు. అందుకే ఆమెను టాలీవుడ్‌ మిత్రవిందా అని, చందమామ అని ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు.

ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చి న ఆమె మాతృత్వాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. తన గారాల బిడ్డ నీల్‌(Neil)తో ఆడుతూ తన గురించి ఇన్‌స్టాగ్రామ్‌ లో ప్రేమపూర్వకంగా ఎన్నెన్నో విషయా లు చెబుతున్నారు. కాజల్‌కు నలుగురితో కలిసి ఉండడమంటే ఎంతో ఇష్టం. మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు ఎలా ఉంటున్నాయో ఆమె చెప్పుకొచ్చారు. అందానికి ఆమె సరైన నిర్వచనం ఇచ్చారు.


''ఫోన్‌, సోషల్‌ మీడియా అనేది మనుషుల్లో అంతరాన్ని పెంచుతుంది. ఆరుగురు కూర్చుని భోజనం చేస్తుంటే అందులో నలుగురు ఫోన్‌తోనే ఆడుతున్నారు. ఇక మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు ఎక్కడి నుంచి వస్తాయి. మనుషుల మధ్య బంధం బలంగా ఉంటేనే జీవితం బావుంటుందని నమ్ముతాను అని చెప్పుకొచ్చింది ఇక అందం విషయానికొస్తే.. అందం అంటే మేకప్‌ అనే భ్రమలో ఉన్నారంతా. సోషల్‌ మీడియా పెరిగాక బాగా మేకప్‌ వేసుకుని, గ్లామర్‌గా కనిపిస్తూ ఫొటోలు తీసుకుని పోస్ట్‌ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు కొందరు. మహిళలకు అందం ఒక్కటే కొలమానం కాదని అందం అంటే మేకప్‌ వేసుకోవడం, రంగురంగుల దుస్తులు ధరించడం అసలు అయితే కాదు. మంచి మనసు, స్వచ్ఛమైన వ్యక్తిత్వం, చేసే పనిలో నిజాయతీలో కూడా అందంలో భాగమేనని ! మనం మనలా ఉంటూ ఆత్మవిశ్వాసంతో మెలగడమే అమ్మాయికి అస్సలు అందం అని నేను నమ్ముతా'' అని కాజల్‌ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తన బిడ్డను ఆడిస్తూ బిజీగా ఉన్న కాజల్‌ మళ్లీ తెరపై ఎప్పుడు కనిపిస్తారో చూడాలి మరి. ఆమె నటించిన తమిళ మరియు హిందీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


కాజల్ ప్రస్తుతం తన కొడుకు బాధ్యత చూసుకుంటుంది. కొన్ని రోజులకు ఆమె తిరిగి నటిస్తుంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: