కోలీవుడ్ ఇండస్ట్రీబ్ ఫుల్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరైన తళపతి విజయ్ ఈ మధ్యనే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన బీస్ట్ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.  బీస్ట్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న తళపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ కథను ముందుగా దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ బాబు కు వినిపించాడట , కాకపోతే డ్యూయల్  రోల్ ఉన్న పాత్రలో నటించడం పెద్దగా ఇష్టం లేని మహేష్ బాబు ఈ మూవీ ని సున్నితంగా నిరాకరించాదట.  

దానితో వంశీ పైడిపల్లి ఈ కథను తలపతి విజయ్ కి వినిపించగా ఈ సినిమా లోని డ్యూయల్ రోల్ పాత్ర విజయ్ కి చాలా బాగా నచ్చడం తో వెంటనే ఈ మూవీ కి ఓకే చెప్పాడట. అలా డ్యూయల్ రోల్ పాత్ర ఉండటం వల్ల  మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథను అదే డ్యూయల్ రోల్ ఉండడం వల్ల విజయ్ ఒకే చేశాడట. ఇది ఇలా ఉంటే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ మూవీ లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: