సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా  సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అలా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో వరస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్నాడు. అలా వరుస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్న మహేష్ బాబు ఆ తర్వాత భరత్ అనే నేను సినిమా తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. 

ఆ తర్వాత మహర్షి , సరిలేరు నీకెవ్వరు మూవీ లతో వరుస విజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎందుకని మహేష్ బాబు ఆ ఫామ్ ను అలాగే కంటిన్యూ చేశాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న మహేష్ బాబు తాజాగా సర్కారు వారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర పది రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న సర్కారు వారి పాట సినిమా పదవరోజు కలెక్షన్లతో 100 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది.  

భరత్ అనే నేను, మహర్షి , సరిలేరు నికెవ్వరు సినిమాలతో 100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన మహేష్ బాబు తాజాగా విడుదలైన సర్కారు వారి పాట సినిమాతో మరొక సారి వంద కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసి కెరియర్ లో నాలుగు సార్లు వంద కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన హీరోగా మహేష్ బాబు రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం కూడా  సర్కారు వారి పాట సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: