సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక జోనర్ ను ఏర్పాటు చేసుకున్న నటులలో బాబు మోహన్ కూడా ఒకరు. ఇండస్ట్రీలో బెస్ట్ కమిడియన్స్ లిస్ట్ లో బాబు మోహన్ కూడా ఉంటారు. అప్పట్లో నటుడు కోట శ్రీనివాస రావు మరియు బాబు మోహన్ ల కాంబోలో వచ్చిన కామెడీకు చాలా డిమాండ్ ఉండేది. చాలా సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. వీరు మంచి స్నేహితులు కూడా. అయితే సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో చాలా కష్టపడ్డారట. పేద కుటుంబం నుండి వచ్చి శ్రమించి నేడు అందరూ గుర్తించదగిన వ్యక్తిగా, కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నారు. కాగా ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన నటుడు బాబు మోహన్ తన తల్లి గురించి చెబుతూ ఏమోషనల్ అయ్యారు. తన తల్లిని తలుచుకుంటూ ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడిని అని చెప్పుకొచ్చారు.

తాను విద్య లో ఎపుడు ముందుడే వాడని, క్లాస్ ఫస్ట్ అలాగే క్లాస్ లీడర్ కూడా అని  పేర్కొన్నారు. అన్నిటిలోనూ చాలా దైర్యంగా ముందుకు వెళ్ళేవాడినని, కానీ  అమ్మ గుర్తొస్తే మాత్రం కన్నీళ్లు ఏరై పరేవని. ఏడుపు అస్సలు ఆగేది కాదని అన్నారు. . అమ్మ  గురించి ఎవరైనా కొంచం తప్పుగా మాట్లాడితే అస్సలు సహించేవాడిని కానని  వారి పని చెప్పేవారని అన్నారు. నేను హీరోగా చేసిన టైం లో కూడా తనపై ఎటువంటి విమర్శలు రాలేదని, నన్ను నా నటనను ఎవరు విమర్శించేవారు కాదని.. నన్ను ప్రశ్నించేవాళ్లు ఇండస్ట్రీలో ఇంకా పుట్టలేదని బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను హీరోగా చేయాలని ఎంకరేజ్ చేశానని చెప్పుకొచ్చారు.  అప్పట్లో తనకు చాలా క్రేజ్ ఉండేదని...హీరోగా చేస్తున్న రోజుల్లో తనకు 14 మంది కి పైగానే  అడ్వాన్స్ లు చెల్లించి మరి అగ్రిమెంట్ లు చేసుకున్నారు.
   
ఇక నాకు కోట శ్రీనివాసరావుకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన విషయం నిజమే కానీ...అవి ఎక్కువ కాలం మా మధ్య నిలువ లేదు... మేము ఎప్పటికీ మంచి స్నేహితులమే అని అన్నారు.  ఒకచోట ఉంటూ కొనసాగుతున్న సమయంలో చిన్నచిన్న బేధాభిప్రాయాలు సహజం అలాగే మా మధ్య వచ్చేవి అలాగే వెళ్ళేవి అన్నారు. మేమిద్దరం ఎంత మంచి స్నేహితులం అంటే కోట శ్రీనివాసరావు , నేను కలిసి ఒకే ప్లేట్ లో భోజనం చేసేవాళ్లమని గంటల తరబడి సినిమాల గురించి మా వ్యక్తిగత జీవితాలే గురించి చర్చించుకునే వారమని అన్నారు. కోటా గారి తరవాత, బ్రహ్మానందంతో కూడా తనకు మంచి బాండింగ్ ఉండేదని ఆయన కూడా చాలా క్లోజ్ గా ఉండేవారని తెలిపారు బాబు మోహన్.  నటన విషయంలో మా మధ్య  పోటీతత్వం ఉండేదని పోటీ అనేది లేకపోతే ఇండస్ట్రీలో ఎదగడం కష్టం అని అయితే అది పాజిటివ్ వాతావరణం లోనే ఉండేదని పలు విషయాలను పంచుకున్నారు బాబు మోహన్.

మరింత సమాచారం తెలుసుకోండి: