మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత అసలు గ్యాప్ లేకుండా సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు..అన్నీ సినిమాలు కూడా బాక్సాఫిస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది. మొన్న వచ్చిన ఆచార్య సినిమా తప్ప మిగిలిన అన్నీ సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి..ఇప్పుడు కూడా యంగ్ హీరోలకు షాక్ ఇస్తూ మరీ ఏకంగా పది సినిమాలను లైన్లో పెట్టాడు..తమిళ దర్శకుడు మోహన్ రాజాతో కలిసి 'గాడ్‌ఫాదర్' అనే మూవీని తెరకెక్కిస్తున్న మెగాస్టార్, ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు.


ఆ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..తమిళ దర్శకుడు మోహన్ రాజాతో కలిసి 'గాడ్‌ఫాదర్' అనే మూవీని తెరకెక్కిస్తున్న మెగాస్టార్, ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొనగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్‌చల్ చేస్తోంది..అయితే ఈ సినిమా లో సల్మాన్ ఖాన్ పాత్ర చాలా కీలకంగా ఉండటమే కాకుండా ఓ పాటలో చిరుతో కలిసి సల్మాన్ కూడా చిందులేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న మెగాస్టార్, ఈ నెలాఖరున తిరిగి రానున్నారు. ఇక వచ్చిన వెంటనే జూన్ మొదటివారంలో గాడ్‌ఫాదర్ సినిమా కోసం ఓ పాట షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో చిరుతో పాటు సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ పాట ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది.మలయాళ మూవీ లూసిఫర్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో గాడ్‌ఫాదర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో కలిసి చిరు చిందులేస్తే ఆ పాట ఎలా ఉండబోతుందా అని ఆడియెన్స్ ఆతృతగా చూస్తున్నారు...నయన తార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: